Site icon NTV Telugu

CM Jagan : నేడు అమిత్‌ షాతో భేటీ కానున్న సీఎం జగన్‌

Amit Shah Cm Jagan

Amit Shah Cm Jagan

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో సీఎం జగన్‌ పాల్గొనున్నారు. రాత్రికి అమిత్‌ షాతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. అయితే.. రేపు ఉదయం తిరిగి ఢిల్లీ నుంచి ఏపీ బయల్దేరనున్నారు సీఎం జగన్‌. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విజ్ఞాన్ భవన్ లో జరిగే “వామపక్ష తీవ్రవాదం సమీక్షా సమావేశం”లో పాల్గొననున్న సీఎ జగన్‌.. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. కేంద్ర హోం మంత్రి, ఏపీ సీఎం మధ్య జరిగే ముఖాముఖి సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వెరైటీ టాస్క్..కోపంతో రగిలిపోయిన శివాజీ.. షాక్ లో కంటెస్టెంట్స్..

ఇదిలా ఉంటే.. నిన్న సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని ఆయన వినతి చేశారు. ఇక, సీఎం జగన్ సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డిలు ఉన్నారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అనంతరం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సీఎం జగన్‌ కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై ప్రధానంగా ఆయన చర్చించారు.

Also Read : Anupam Kher : రవితేజ ఎదుగుదలకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది…

Exit mobile version