NTV Telugu Site icon

CM Jagan : నేడు విశాఖకు సీఎం జగన్‌.. షెడ్యూల్‌ ఇదే..

Cm Ys Jagan

Cm Ys Jagan

ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో భాగంగా నేడు.. సీఎం జగన్‌ విశాఖకు పయనం కానున్నారు, ప్రధాని నరేంద్రమోడీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంవో జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ రోజు సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌… 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. అలాగే.. రేపు ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు సీఎం జగన్‌. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు.

Also Read : America: భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం.. 23 ఏళ్లకే అమెరికా చట్టసభలోకి..

10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉంటే.. ప్రధాని పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు సహా 7వేల మంది పోలీసులు నగరంలో మోహరించారు. 2 వేల సీసీ కెమెరాలు నగరంలో ప్రతీ కదలికను రికార్డ్ చేస్తున్నాయి.