Site icon NTV Telugu

CM Jagan : ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నాం

Cm Jagan

Cm Jagan

విజయవాడలో సీఎం జగన్‌ పర్యటించారు. ఈ నేపథ్యంలో కనకదుర్గ వారధి దగ్గర రిటైనింగ్‌ వాల్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. రూ.12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌ అభివృద్ధి చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో ఇప్పటికే రూ.400 కోట్లతో అంబేద్కర్‌ పార్క్‌ను ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామన్నారు. ఏపీ చేయని ప్రతి పక్షాలు అభివృద్ధి అంటున్నాయని ఆయన మండిపడ్డారు. రెండు కరకట్ట గోడలు 5 వందల కోట్లతో కట్టామని, ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పడమే కానీ…దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిందని, రివర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటు చేసామన్నారు. విజయవాడ లో వివిధ కాలనీల్లో 31 వేల 866 కు పైగా పట్టాలను క్రమమబద్ధీకరిస్తూ సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇస్తున్నామని, 239 కోట్లతో సివరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసామన్నారు. అభివృద్ధిని ప్రతి అడుగులో చూపిస్తున్నామని, ఏమి చేయని విపక్షాల వారు అభివృద్ధి…అభివృద్ధి అంటారని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటరీ వ్యవస్థ తో మంచి చేసే కార్యక్రమం కేవలం 58 నెలలుగా జరుగుతోందని, పార్క్ లకు కృష్ణమ్మ జలవిహార్ పేరు పెడుతున్నామని ఆయన తెలిపారు.

T20 World Cup 2024: సీఏపై ఒత్తిడి తెస్తున్న కోచ్.. ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్!

అంతేకాకుండా.. ‘ఈ రోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ, మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ఇందులో 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మంది.. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్.. అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి ఇవన్నీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతోంది. అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్ జరుగుతోంది.’అని ఆయన అన్నారు.

Also Read : Sharathulu Varthisthai: కేటీఆర్ చేతుల మీదుగా చైతన్య రావ్ “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా నుంచి ‘తురుమై వచ్చేయ్..’ లిరికల్ సాంగ్ రిలీజ్.

Exit mobile version