Site icon NTV Telugu

CM Jagan: రేపు తిరుపతిలో సీఎం జగన్ టూర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతికి రానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరతారు సీఎమ్ జగన్. అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీకి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్.

అనంతరం 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన చేశారు జగన్. అక్కడి నుంచి టాటా క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించనున్నారు జగన్. అక్కడి రేడియాలజీ, రేడియోథరెపీ, ఏవీ ప్రజెంటేషన్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండున్నరకు రేణిగుంట నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. మూడున్నరకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్.

తిరుపతి క్యాన్సర్‌ కేర్‌కు చిరునామా కానుంది. టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం కానుంది. క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిగా ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారంతో అలిపిరి వద్ద ఈ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కాబోతోంది. అందుకోసం 25 ఎకరాలు ఇచ్చింది టీటీడీ. ఆసుపత్రిని రేపు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్‌ వైద్యం పేదలకు అందనుంది. త్వరలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు ప్రారంభం అవుతాయి.

Congress : రాహుల్‌ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టు పిటిషన్‌..

Exit mobile version