NTV Telugu Site icon

Undavalli Arun Kumar: ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి..

Undavalli Arunkumar

Undavalli Arunkumar

Undavalli Arun Kumar: సీట్ల మార్పుపై ముఖ్యమంత్రి జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.జగన్ తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఫీలింగ్గే ఇప్పుడు ఎమ్మెల్యేలలో వుందన్నారు. నాడు జగన్ బాధ పడ్డట్టు గానే ఇప్పుడు సీట్ల మార్పు ఎమ్మెల్యేల ఫీలింగ్ కూడా అలాగే వుందని అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ మార్చడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. జగన్ ఆలోచన అలా లేదన్నారు.సీట్లు మార్పు చాలా జాగ్రత్తగా చేయాలని సలహా ఇచ్చారు. జగన్‌కు, వాలంటీర్ల మధ్య ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు పవర్ ఎక్కడుoదని వ్యాఖ్యానించారు.

Read Also: Nandi Drama Festivals: నంది నాటకోత్సవాలు ప్రారంభం.. అనర్హులకు నంది అవార్డులు రావు: పోసాని

ఎమ్మెల్యేలకు గ్రాఫ్ పెరగలేదని అంటే ఎలా.. అంటూ ప్రశ్నించారు.రాజమండ్రిలో తనకు మొదట అంగిటపల్లి చినఎరుకల రెడ్డి(ఏసీవై రెడ్డి)ని టికెట్‌ ఇచ్చారని.. కానీ తనను ఏసీవై రెడ్డి ఓడించారని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. అదే ఏసీవై రెడ్డి ఒప్పించి నాకు సీటు ఇచ్చివుంటే గెలిచే వాడినేమో అి అభిప్రాయపడ్డారు. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమీ చెప్పలేమని, దేశంలో ఎక్కడా లేని ప్రయోగం జనానికి డబ్బులు పంచే కార్యక్రమం జగన్ చేశాడని వ్యాఖ్యానించారు. అయితే ఇది కొత్తేమీ కాదు.. ఇలాంటి ప్రయోగాలు ఇందిరా గాంధీ భూమి పంపిణీ తో మొదలు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో సీట్ల మార్పు చేయకపోవడం వల్లే అధికార పార్టీ ఓడిపోయిందని ఇక్కడ సీట్ల మారిస్తే గెలుపు సాధ్యం అనుకోవడం సరికాదని అన్నారు. వైఎస్సార్ పేరుతో పార్టీ పేట్టి లక్ష్యాలు విషయంలో, ఆశయాలు అంశంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే మనుగడ కష్టమేనని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.