NTV Telugu Site icon

CM Jagan: చిలకలూరుపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

Jagan

Jagan

పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓటు హక్కును వినియోగించుకుని హైదరాబాద్ కి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరిగి వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

Read Also: NewsClick Editor: న్యూస్ క్లిక్ ఎడిటర్ విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

అలాగే, చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిప ఆరో వ్యక్తిని పోలీసులు గుర్తించారు. గొనెశపూడికి చెందిన శీనుగా గుర్తించారు. బస్సు డ్రైవర్ సీటు వెనుకున్న బెర్తులో శ్రీను పడుకున్నాడు.. శ్రీను బంధువులకు సమాచారం అందించిన పోలీసులు.. ఇప్పటి వరకు బస్సు ప్రమాదంలో మరణించిన వారి పూర్తి వివరాలను పోలీసులు సేకరించి.. వారి వారి బంధువులను సమాచారం అందించారు. 1. ఉప్పుగుండూరి కాశీ, 2. ఉప్పుగుండూరి లక్ష్మీ, 3. ముప్పురాజు ఖ్యాతి సాయి శ్రీ, 4. శీను, 5. అంజి (బస్ డ్రైవర్), 6. హరిసింగ్ (టిప్పర్ డ్రైవర్), కాగా, ఈ బస్సు క్లీనర్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.