NTV Telugu Site icon

CM Jagan: ఎన్నికలయ్యాక టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు..

Jagan 2

Jagan 2

ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడని దుయ్యబట్టారు.

Chhattisgarh: సీఏఎఫ్ జవాన్‌ని గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు..

ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్‌ ఒకడికే సాధ్యం కాదు.. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, రైతన్న కూడా మీ జగన్‌కు తోడుగా స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుందన్నారు.పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయని పేర్కొన్నారు. పేదవాడి భవిష్యత్‌ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10-15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడాలంటే, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమని సీఎం జగన్ తెలిపారు.

CM Jagan: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి..

మరో రెండు నెలల్లోనే ఎన్నికలు రానున్నాయని.. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమోనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి.. చంద్రబాబు ప్రచారాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అక్కడున్న జనాలను ఉద్దేశించి అన్నారు. మీ అందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయా.. ఆ సెల్‌ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి.. అందులో లైట్‌ బటన్‌ నొక్కండి.. సెల్‌ టార్చర్‌ ఆన్‌ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే అని చెప్పండని అన్నారు. ప్రతి కార్యకర్త, బూత్‌ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం.. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా అని తెలిపారు.