మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వివిధ కార్యక్రమాల అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రై రేషన్ పంపిణీ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు అని అధికారులకు సీఎం చెప్పారు.
Read Also: The Sphere: ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డాగా స్పియర్.. ప్రత్యేతలు ఏంటంటే?
ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నారు.. వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుంది.. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలి అని ఆయన తెలిపారు. ప్రతి నెల గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలి.. జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సీఎం జగన్ సూచించారు. వ్యాయామాలపై క్యాంపులు నిర్వహించాలి అని సీఎం జగన్ తెలిపారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్నారు. అయితే, ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జీ.జయలక్ష్మీ, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.