NTV Telugu Site icon

CM Jagan : కందుకూరు ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

Jagan

Jagan

నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. అయితే.. ఈ ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. కందుకూరు ఘటనపై సీఎం వైయస్‌. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన సీఎం జగన్‌.. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న ప్రధాని మోడీతో భేటీ అయిన జగన్‌.. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు.

Also Read :Adivi Sesh: ఇండియాని షేక్ చేసే అనౌన్స్మెంట్… జాన్ 9న
నిన్న ప్రధానికి కలిసిన జగన్‌.. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలను విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పునవర్విభజన చట్టంలోని అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీల అమలుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని.. హామీల అమల్లో కొంత పురోగతి సాధించినా, మరిన్ని కీలక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలను, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఏపీ ఆ లోటును భరిస్తోందని వివరించారు.