CM YS Jagan: ఏపీలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఐదో రోజు దిగ్విజయంగా కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా సీఎం యాత్ర కదిరికి చేరింది. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Jupudi Prabhakar Rao: పేదవాడికి చట్ట సభల్లోకి వచ్చే అర్హత లేదా చంద్రబాబు?
కదిరిలో సీఎం యాత్ర ఇలా..
సాయంత్రం 5.45 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర కదిరిలో ప్రవేశించింది. కదిరిలో జన సునామీ.. మేమంతా సిద్దమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో జనప్రభంజనం కదం తొక్కింది. దారిపొడువునా ముఖ్యమంత్రి బస్సుతో పాటు కడలితరంగాల్లా జనం కదిలారు. గజమాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేశారు సీఎం జగన్. దాదాపు 7.55 వరకు సుమారు రెండు గంటల పదినిమిషాలు పాటు కదిరిలో రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.