NTV Telugu Site icon

YCP Fourth List: నాలుగవ జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠ

Jagan

Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో నాలుగవ జాబితాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నాలుగవ జాబితా కోసం వైసీపీ అధినాయకత్వం తుది కసరత్తు ప్రారంభించింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఫుల్ బిజీగా ఉన్నాట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం కసరత్తు ఆరంభించారు. పలువురు ఇన్చార్జీల మార్పుతో నాలుగో జాబితాను సిద్దం చేస్తున్నారు.

Read Also: Samantha: నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే.. నా భర్త అలా చేయడం వలన..

ఇక, సీఎంవోకు మంత్రి అంబటి రాంబాబుతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు వచ్చారు. అలాగే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఇక, పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది.. దీంతో హుటాహుటినా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వీరి ఇరువురి సమావేశంలో కందుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి మార్పుపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు టాక్. అలాగే, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ కూడా సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి మార్పుపై చర్చిస్తున్నారు.

Read Also: Upsc Recruitment 2024 : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

అలాగే, మార్కాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ ను మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కలిశారు. మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పేరును దాదాపు సీఎం ఖరారు చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పిలిపించి జగన్ మాట్లాడారు. దీనికి సంబంధించి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చారు.

Read Also: Merugu Nagarjuna: దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు

అయితే, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే ఎంపీ అభ్యర్ధులే ఎక్కువ మంది ఉంటారని సమాచారం. ఇప్పటికే కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్ధులను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. ఇక, నాలుగవ జాబితాలో ఏకంగా తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు ముమ్మరంగా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. నాలుగో జాబితాలో నర్సరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్దులను సీఎం జగన్ ప్రకటించే ఛాన్స్ ఉంది.