NTV Telugu Site icon

CM JaganMohan Reddy: పొలిటికల్ పంచ్‌ లు.. పవన్, బాబుపై విసుర్లు

jagan babu pawan

Ba9b2fad B773 4e3a B000 Bea6f62ec812

అవనిగడ్డ సాక్షిగా జగన్ వరాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసిన మంచి ఏంటో చెప్పుకోలేరు. బూతులు తిట్టడం మామూలుగా లేదు. చెప్పులు చూపిస్తూ.. దారుణమయిన బూతులు మాట్లాడుతుంటే.. ఇలాంటి వారు మన నాయకులా, బాధ అనిపిస్తుంది. మొన్ననే దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమని మాట్లాడిస్తున్నాడో మనం చూస్తున్నాం. మనం ఎవరికీ అన్యాయం చేయకుండా.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తున్నాం. మూడు రాజధానులు వద్దని.. మూడు పెళ్ళిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు. మీరూ చేసుకోండి అని టీవీల్లో నాయకుల్లా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి?

మన ఇంట్లో మూడు నాలుగు పెళ్ళిళ్లు చేసుకోమంటే ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? ఇలాంటి వారా మన నాయకులని ఆలోచన చేయాలి. దశ, దిశ చూపగలరా? మంచి చేసిన చరిత్ర లేనివారు, వెన్నుపోటు దారులు, రంగురంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు మరిచిపోతారు.. మేనిఫెస్టోలు కనిపించకుండా చేస్తారు. ఆ పార్టీ వెబ్ సైట్ లో మేనిఫెస్టో కనిపించదు. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీఎం జగన్.. మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుంది.. ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుందన్నారు. ఇలాంటి వారిపై పోరాటం సాగుతుంది. 19 నెలల్లో ఈ పోరాటం నడుస్తుంది. దేవుడి దయ వుంది.

మంచి జరిగిన కుటుంబం వారు నాకు అండగా వుంటారు. అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు, మీడియా, పొత్తులను నమ్ముకుంటే నేను అక్కచెల్లెళ్ళను నమ్ముకున్నాను. పేదవాడికి, పెత్తం దారులకు మధ్య జరుగుతున్న యుద్ధం.. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని, ముక్కలు చెక్కలు చేయాలని వారిపై జరిగే యుద్ధం. ఇలాంటి వారిని దూరంగా వుంచండి. రాబోయే రోజులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ టీవీలు చూడవద్దు, పేపర్లు చదవద్దు. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలబడండి. దత్తపుత్రుడు, మీడియా లేకపోయినా మీ అండ కావాలి. ప్రజలంతా నాకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం ఉంది

నేను దత్త పుత్రుడిని, మీడియాను నమ్ముకోలేదు. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. సామాన్యుడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. వచ్చే రోజుల్లో ఈ కుట్రలు, కుతంత్రాలు మరింత పెరుగుతాయి. మీడియాని కాదు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే నాకు మద్దతుగా నిలబడండి అన్నారు జగన్.

అంతకుముందు అవనిగడ్డలో రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్‌ చెప్పారు.. భూములపై సీఎం జగన్‌ అన్ని హక్కులు కల్పించారు.భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్‌. రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్‌ కల్పించారు. 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది. ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం అన్నారు మంత్రి ధర్మాన.