NTV Telugu Site icon

CM JaganMohanReddy: త్వరలో విశాఖ రాజధాని కాబోతోంది.. నేనూ షిఫ్ట్ అవుతున్నా

Vizag 2 (1)

Vizag 2 (1)

ఢిల్లీలో జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అన్నారు సీఎం జగన్. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాది. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ ఒన్‌గా నిలిచాం. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఈర్యాంకులు ఇచ్చారన్నారు జగన్. ఇప్పటికే 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

విశాఖే రాజధాని.. జగన్ సంచలన వ్యాఖ్యలు LIVE | CM Jagan Sensational Comments | Ntv

Read Also:Top Headlines @1PM: టాప్ న్యూస్

అదనంగా మరికొన్ని పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఉన్నాయి. పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్‌ డెస్క్‌ విధానం అమల్లో ఉందన్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నాం. వివిధ ఉత్పత్తులకు సంబంధించి తయారీ రంగంలో క్లస్టర్లు ఉన్నాయి. విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతుంది. ఇక్కడే గ్లోబల్‌ సమ్మిట్‌ మార్చి 3,4 తేదీల్లో నిర్వహిస్తున్నాం అన్నారు. మీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతున్నాం అన్నారు. లీలా ప్యాలెస్‌‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సన్నాహక సమావేశం జరిగింది. మార్నింగ్‌ సెషన్‌లో దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వివిధ దేశాల దౌత్యాధికారులు పాల్గొన్నారు. లీలా ప్యాలెస్‌ హోటల్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌.జగన్ సమావేశం ప్రారంభించి మాట్లాడారు.

Read Also: Anam Ramnarayana Reddy; 15 నెలల్లో ఏం మార్పులు వస్తాయో చూడాలి