NTV Telugu Site icon

CM Jagan Mohan Reddy: కొత్త పాలిటెక్నిక్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Cm Jagan

Cm Jagan

వినూత్న పథకాలతో అన్ని వర్గాలతో పాటు యువతను ఆకట్టుకుంటున్నారు సీఎం జగన్. తాజాగా యువత భవిత దిశగా కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేశారు జగన్. నంద్యాల జిల్లాలోని బేతంచెర్లకు ఓ కాలేజ్ కేటాయించడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీల స్థాపనకై ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసిందని ఆర్థిక, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

Read Also: Vishwak Sen: నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ నువ్వే.. విశ్వక్ ఏమన్నాడంటే..?

నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లాలోని గుంతకల్, వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతాలలో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు. కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ,సివిల్, కెమికల్, మెటలార్జికల్ రంగాలలో డిప్లొమా కోర్సులు అందిస్తారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య, శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీలలో ఒకటి తన సొంత నియోజకవర్గం డోన్ లోని బేతంచెర్లలో రూ.30కోట్లతో ఏర్పాటు అవనుండడం పట్ల నియోజకవర్గం, జిల్లా యువతీయువకుల తరపున మంత్రి బుగ్గన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యువతీయువకులు మెరుగైన అవకాశాలు అందించే దిశగా 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడాన్ని మంత్రి బుగ్గన అభినందించారు.

Read Also: World Oral Health Day : ఇవి తింటే డెంటల్ డాక్టర్‎తో పనే లేదు