NTV Telugu Site icon

CM JaganMohanReddy: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం

Cmjagan (1)

Cmjagan (1)

మరో రెండు వినూత్న పథకాలను ప్రారంభించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాలు ప్రారంభం అయినట్టు ప్రకటించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాలను నిరోధించేందుకు విప్లవాత్మక అడుగు. ఇప్పుడు కళ్యాణమస్తు, షాదీతోఫాలు తీసుకు వచ్చాం. వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫాలు… పెళ్లి చేసుకుంటున్న ఇద్దరు పిల్లలు కూడా కచ్చితంగా పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకు వస్తున్నాం అన్నారు.

దీనివల్ల కచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పదో తరగతి వరకూ చదివిస్తారు. పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. దీని వల్ల పిల్లలంతా చదువుకునే పరిస్థితి వస్తుంది. టెన్త్‌ పాసైతే… ఆ తర్వాత 18 ఏళ్ల వరకూ పెళ్లి చేసుకోలేరు కాబట్టి, ఇంటర్మీడియట్‌ కూడా చదువుకునే అవకాశం వస్తుంది. ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో పథకం పెట్టేవారన్నారు జగన్.

తర్వాత పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68కోట్లు వివాహ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈపథకం అమల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గత ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా.. ఇప్పుడు రెట్టింపు ఈ పథకం ద్వారా అందబోతోంది. గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలకు రూ50వేలు ఇస్తామని ప్రటిస్తే.. ఇప్పుడు మనం రూ.1 లక్ష ఇవ్వనున్నాం. ఎస్సీ, ఎస్టీల్లో కులాంత వివాహాలకు రూ.75వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు మనం రూ.1.2 లక్షలు ఇవ్వనున్నాం. బీసీలకు రూ.30వేలు ఇస్తామని ప్రకటిస్తే. ఇప్పుడు మనం రూ.50వేలు ఇవ్వనున్నాం.

Read Also: Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..

బీసీల కులాంతర వివాహాలకు రూ.50వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.75వేలు ఇవ్వనున్నాం. మైనార్టీలకు గత ప్రభుత్వం రూ. 50వేలు ప్రకటిస్తే.. మనం రూ.1లక్ష ఇవ్వనున్నాం. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం రూ.1 లక్ష ఇస్తే, ఇప్పుడు రూ.1,50,000లు ఇవ్వనున్నాం. భవన, ఇతర నిర్మాణకార్మికులకు రూ.20వేలు గత ప్రభుత్వం ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.40వేలు ఇవ్వనున్నాం. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. పెళ్లైన 60 రోజుల్లో వారి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం.అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో దరఖాస్తు లబ్ధిదారులకు జనవరిలో ఇవ్వబడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉన్నవారికి ఏప్రిల్‌లో, ఏప్రిల్, మే, జూన్‌లో ఉన్నవారికి జులైలో ఇవ్వడం జరుగుతుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో లబ్ధిదారులకు అక్టోబరులో పథకాలను అందిస్తాం. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను కూడా సచివాలయాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్.

Read Also:యంగ్ ఏజ్ లోనే తండ్రులను పోగోట్టుకున్న స్టార్ హీరోలు వీరే..