NTV Telugu Site icon

CM Jagan : ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌

Cm Jagan

Cm Jagan

విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్యా, వైద్య -ఆరోగ్య , మహిళా సాధికారత, సామాజిక వర్గాల అభ్యున్నతి, పారిశ్రామిక రంగాల్లో తన ప్రభుత్వం తీసుకుని వచ్చిన మార్పులను వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు తన ప్రసంగంలో ప్రకటించారు సీఎం జగన్.

Also Read : Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్‌పై నిషేధం!

నాడు-నేడు ద్వారా 45,000 గవర్నమెంట్ బడుల రూపు రేఖల్ని 12 అంశాల్లో మారుస్తున్నామని, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తూ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ (ఐఎఫ్పీ)లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వమని, రాష్ట్ర వ్యాప్తంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. వైద్య ఆరోగ్య శాఖలో గత నాలుగేళ్ళలోనే జరిపిన సిబ్బంది నియామకాలు రికార్డు స్థాయిలో 53,126 అని, ప్రతి మండలానికీ 2 చొప్పున 104 వాహనాలు అందజేశామని, కనీసం ఒక 108 అంబులెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. స్పెషలిస్టు డాక్టర్లు దొరక్క, జాతీయ స్థాయిలో 61 శాతం పోస్టులు ఖాళీ.. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ల ద్వారా రాష్ట్రంలో 96.04 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల్ని భర్తీ చేశామన్నారు.

Also Read : Game of Thrones : ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదలకాబోతున్న ఫేమస్ వెబ్ సిరీస్..?