ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వడం లేదు అని ఆరోపించారు. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు 1191 కేసులు వేశారు.. చంద్రబాబు సృష్టించిన న్యాయపరమైన అడ్డంకులన్నింటిన్నీ దాటుకుని వచ్చామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం.. పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం.. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశాం.. ఇంటింటికీ తలుపు తట్టి ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం.. అందరికీ ఒకటే రూల్స్ ఉండాలని నిబంధనలు మార్చాం అని సీఎం జగన్ తెలిపారు.
Read Also: 2G Services Shut Down Demand: దేశంలో నిలిచిపోనున్న 2జీ సేవలు ?
గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలి అని సీఎం జగన్ తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయం ఉండకూడదని రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇస్తున్నాం.. రాష్ట్ర ప్రజలకు రెండు రకాల పద్ధతులు మొదట్లో ఆశ్చర్యం కలిగించింది.. గ్రామీణ స్థాయిలో సచివాలయాల ద్వారా అందుబాటులో పౌర సేవలు తీసుకొచ్చామన్నారు. పేద పిల్లలకు ప్రభుత్వ పాటశాలలు.. అక్కడ తెలుగు మీడియం చదువులు.. డబ్బున్న వాళ్లకు ప్రైవేట్ స్కూల్స్.. ఇప్పుడు పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాం.. పిల్లల చదువుల్లో మొదటిసారిగా 8వ తరగతికి రాగానే టాబ్స్ ఇచ్చామని గుర్తు చేశారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. విద్యా దీవెన, వసతి దీవెనలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. డబ్బున్న వారి పిల్లలకు, డబ్బులేని వారి పిల్లలకు చదువుల మధ్య అంతరాలు లేకుండా చేశామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Kurchi Madathapetti song : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన జపాన్ జంట..
వైద్య, ఆరోగ్య రంగాల్లో సమూల మార్పులు చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం.. 25 లక్షల వరకూ ఆరోగ్య శ్రీ ద్వార వైద్య సేవలను.. ఆరోగ్య ఆసరా కూడా ఇస్తున్నాం.. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతున్నా.. అక్క చెల్లెమ్మలు అప్పుల పాలు కాకూడదని, భద్రత ఉండాలని పలు పథకాలు అమలు చేస్తున్నాను అని ఆయన తెలిపారు. పథకాల వల్లే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది.. జాతీయ స్థాయిలో వచ్చిన గణాంకాలు కూడా ఇదే చెబుతున్నాయి.. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం.. 75 శాతం పేద సామాజిక వర్గాలకే పథకాలు అందుతున్నాయన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నామినేటెడ్ పదవులు.. గతంలో పెత్తందార్లకు వచ్చే నామినేటెడ్ పదవులు చట్టం చేసి మరీ పేదల చేతిలో పెట్టాం అని సీఎం జగన్ చెప్పారు.
Read Also: Tantra: డిఫ్రెంట్ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!
రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం అనే పద్దతి లేదు అనే విషయాన్ని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం వల్ల ఆ ఆస్తి మీద హక్కులు భద్రంగా ఉంటాయి.. దొంగ సర్టిఫికేట్లు చేసే వీలుండదు.. హక్కుదారులకు వారి స్థలంలో నిలబెట్టి ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి పట్టాలు ఇస్తున్నామన్నారు. పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో అన్నీ హక్కులు వస్తాయని చెప్పారు. తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం.. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రభుత్వాన్ని చూశారా అని అడుగుతున్నా.. గ్రామ స్వరాజ్యాన్ని అర్థం చెంటున్న ప్రభుత్వం మనదే అని సీఎం జగన్ పేర్కొన్నారు.