ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు Clలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్లు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే.. CM జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలతో నవ్వుతూ, చాలా సరదాగా జగన్ మాట్లాడారు. అటు CMపై దాడి జరిగిన కంటి ప్రాంతంలో ఇంకా వాపు కనిపిస్తుండగా.. దానిపై వైట్ బ్యాండెడ్ ఉంది. ఇక గాయం తీవ్రత నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని YCP శ్రేణులు కోరుకుంటున్నాయి.