Site icon NTV Telugu

CM Jagan: 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి.. నేతలకు దిశానిర్దేశం

Jagan

Jagan

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 2500 మందితో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. వచ్చే 45 రోజులు చాలా కీలకమని అన్నారు. విరామం లేకుండా పనిచేయాలని నేతలకు సూచించారు. పార్టీలో టికెట్ల ఎంపిక దాదాపు పూర్తైంది.. ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపుగా ఫైనల్‌ లిస్ట్‌ అని చెప్పారు. వై నాట్175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Kotamreddy Sridhar Reddy: వాళ్లు సాధించిందేమీ లేదు.. మాకొచ్చిన నష్టం కూడా ఏమీ లేదు

రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం.. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని సీఎం జగన్ దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా అని అన్నారు. మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నామని తెలిపారు. మరోవైపు.. కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశామని సీఎం జగన్ తెలిపారు. కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ బటన్‌ నొక్కడం, పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశామని అన్నారు. ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని తెలిపారు. అంతేకాకుండా.. 57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించామన్నారు.

Kollu Ravindra: వారి దుర్మార్గాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు..

పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. దిశ యాప్‌తో మహిళలకు భద్రత కల్పించామని చెప్పారు. ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించామని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించామని వ్యాఖ్యానించారు. ఇవాళ జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారని చెప్పారు. జగన్‌ గెలిస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని అన్నారు. జగన్‌ చేయగలిగింది మాత్రమే చెబుతాడు.. చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్ధం అయినా చెబుతాడని దుయ్యబట్టారు. ప్రతీ ఒక్క వైసీపీ కార్యకర్త ప్రతీ ఇంటికి వెళ్లి జరిగిన మంచిని చెప్పండి.. జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తామన్నారు. గతంలో 151 సీట్లు వచ్చాయి కాబట్టి, ఈసారి 175కి 175 స్థానాలు గెలవాల్సిందేనని నేతలకు సూచించారు. 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందేనని సీఎం జగన్ అన్నారు.

Exit mobile version