CM Jagan : నేడు పదోరోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

Jagan

Jagan

నేడు పదోరోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో జగన్‌ బస్సుయాత్ర కొనసాగుతుంది. పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు జగన్‌. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్‌ దగ్గర బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్‌. వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్‌. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్‌లో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు.

పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు.

ఇదిలా ఉంటే.. తొమ్మిదవ రోజు బస్సుయాత్రలో.. మీరే మా ఆశ.. మీరే మా శ్వాస అంటూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటెత్తారు జనాలు. మండుటెండను సైతం లెక్క చేయక.. కావలి బహిరంగ సభలో జనసునామీలా వచ్చారు. తన కోసం వచ్చిన వారిని సీఎం జగన్‌ ఆప్యాయంగా పలకరిచి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు.. యువతులు.. వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగి వారిలో ఆనందోత్సాహాలను నింపారు.