NTV Telugu Site icon

CM Jagan: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్‌ దంపతులు

Cm Jagan

Cm Jagan

Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొని నూ­తన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. తర్వాత తన చెల్లెల్లు వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ లను పలకరించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న సీఎం దంపతులు.. రాత్రికి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకోనున్నారు.

Read Also: Jallikattu bull: ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపించిన ఓ వ్యక్తి.. కేసు నమోదు

ఇక, గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్‌లో వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డాల్లస్ లో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ & ప్రిడిక్టివ్‌ అనలటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేసి యూనివ‌ర్సిటీ నుంచి ప‌ట్టా అందుకున్నాడు. ఇక, అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉండగా.. ఇవ్వాళ ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక, ఫిబ్రవరి 17వ తేదీన వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించింది.

Show comments