NTV Telugu Site icon

CM Jagan Comments: చంద్రబాబు హయాంలో స్కీంలు లేవు.. అన్నీ స్కామ్ లే..!

Jagan

Jagan

పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గతంలో ఎప్పుడూ కూడా ఆయన చేయ్యలేదు.. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కరువు ఉంది అని సీఎం ఆరోపించారు. నేను అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షం పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు వెనక గజదొంగల ముఠాతో పాటు దత్తపుత్రుడు ఉన్నాడు అని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హాయంలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించే ఆలోచనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ స్కామ్, ఇసుక స్కామ్, అమరావతి భూముల స్కామ్ లు మాత్రమే జరిగాయని సీఎం జగన్ ఆరోపించారు.

Read Also: Priyanka Gandhi: బొకే స్కాంలో ప్రియాంక గాంధీని ఇరికించిన నేతలు.. స్టేజీ పై నవ్వులు పూయించారు

రైతులను చంద్రబాబు మోసం చేశారు అని సీఎం జగన్ అన్నారు. బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం వేలం వేసేలా చేశాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ పథకాన్ని గత పాలకులు నీరుగార్చారు.. కానీ, నేడు ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి.. దుర్భిక్ష ప్రాంతాల్లో గతంలో ఎన్నడైనా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారా.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద రూ. 45 వేల కోట్లు ఇచ్చాం.. చంద్రబాబుకు అధికారం కావాల్సింది.. ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు.. చంద్రబాబుకు అధికారం కేవలం తాను, తన గజదొంగల ముఠా కోసం అధికారం కావాలని సీఎం జగన్ విమర్శించారు.

Read Also: pregnant woman: నిండు గర్భిణిని అంబులెన్స్ లేక 5కి.మీ దూరం మోసుకెళ్లిన బంధువులు.. కానీ అప్పటికే

ఇక, పుట్టపర్తిలో వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 53 లక్షల 53 మంది రైతులకు పెట్టబడి సాయం.. రైతులకు రూ. 2,200 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం పీఎం కిసాన్‌ డబ్బులు కూడా ఈ నెలలోనే వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాయతక్వంలోకి తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.