CM K.ChandraShekar Rao: మంత్రి గంగుల కమలాకర్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM K.ChandraShekar Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్లో పర్యటించారు. ఇటీవల బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మల్లయ్య మృతిపట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి.. జిల్లా కేంద్రంలోని కొండసత్యలక్ష్మి గార్డెన్లో మంత్రి గంగుల కమలాకర్ తండ్రి దశదినకర్మకు హాజరయ్యారు. ముందుగా మంత్రిని పరామర్శించారు. అనంతరం ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ఈ సందర్భంగా మల్లయ్య కుమారులైన మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరులు గంగుల వెంకన్న, సుధాకర్‌లతో పాటు కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. సీఎం వెంట ఎంపీ సంతోశ్‌కుమార్, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. పెద్దకర్మ అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కు చేరుకుని.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!