NTV Telugu Site icon

CM K.ChandraShekar Rao: మంత్రి గంగుల కమలాకర్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

Cm Kcr

Cm Kcr

CM K.ChandraShekar Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. గంగుల క‌మ‌లాక‌ర్ తండ్రి గంగుల మ‌ల్ల‌య్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మల్లయ్య మృతిపట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ చేరుకున్న ముఖ్యమంత్రి.. జిల్లా కేంద్రంలోని కొండసత్యలక్ష్మి గార్డెన్‌లో మంత్రి గంగుల కమలాకర్ తండ్రి దశదినకర్మకు హాజరయ్యారు. ముందుగా మంత్రిని పరామర్శించారు. అనంతరం ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్

ఈ సందర్భంగా మల్లయ్య కుమారులైన మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరులు గంగుల వెంకన్న, సుధాకర్‌లతో పాటు కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. సీఎం వెంట ఎంపీ సంతోశ్‌కుమార్, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. పెద్దకర్మ అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌కు చేరుకుని.. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

Show comments