NTV Telugu Site icon

CM Chandrababu: రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌ పేలిన ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. శిథిలాల తొలగింపు పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్య తేల్చ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ప్రమాద ఘటనపై హెల్త్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ సెక్రటరీ , ఫ్యాక్టరీస్ డైరెక్టర్ , లేబర్ కమిషనర్ , బాయిలర్స్ డైరెక్టర్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారుతో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు.

Read Also: AP High Court: ట్రాఫిక్‌ పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని ఆయన ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా…ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.