NTV Telugu Site icon

CM Chandrababu: రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేత.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu Review

Chandrababu Review

CM Chandrababu: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో నిమ్మచెట్ల నరికివేతను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షింది లేదన్నారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

 

Read Also: MLC Kavitha: తీహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

 

Show comments