Site icon NTV Telugu

Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఏపీ సీఎం

Jawan Murali Naik, Cm

Jawan Murali Naik, Cm

దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ తల్లిదండ్రులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు సీఎం మౌనం పాటించారు. ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో వీర సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Also Read: Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?

ఛాయాపురం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం. కాశ్మీర్‌లో అతికిరాతకంగా ఆడబిడ్డల ఎదురుగా మగ వాళ్లను ఇష్టానుసారంగా చంపేశారు. ప్రధానమంత్రి ‘సింధూర్’ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పాకిస్థాన్ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దేశ భక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. జవాన్ కుటుంబ సభ్యులతో ఇప్పుడే మాట్లాడినా, దేశం కోసం వీర మరణం పొందిన మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. బార్డర్‌లో ఉండి నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తుండటంతో మనం హాయిగా నిద్రపోతున్నాం. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదు. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలి’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. భారత్ మాతకు జై అని చంద్రబాబు నినాదాలు చేశారు.

Exit mobile version