NTV Telugu Site icon

CM Chandrababu : ఫెంగల్‌ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu

Chandrababu

CM Chandrababu : పెంగల్‌ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జల శక్తి శాఖ, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది. నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు, పెన్నా నది మరియు దాని ఉపనదుల వద్ద నివసిస్తున్న ప్రజలను జాగ్రత్తగా ఉండేందుకు సూచనలు జారీ చేసింది. విపత్తు నివారణ చర్యలకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందించాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. న్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

EPFO: ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఆ పని చేయకుంటే పీఎఫ్ బెనిఫిట్స్ ఆగిపోతాయి

అంతేకాకుండా.. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని, ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు సీఎం చంద్రబాబు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని, ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలన్నారు ముఖ్యమంత్రి.

Temples Vandalized: చటోగ్రామ్‌లో మరో మూడు హిందూ దేవాలయాలపై దాడి