CM Chandrababu: పంటలకు గిట్టుబాటు ధరల నిర్ధారణ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంటలు, ధరలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘంతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ముందే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని విశ్లేషించి ఏ పంటలు సాగు చేయాలో సూచించాలని సీఎం పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: India U19: ఇంగ్లాండ్ పర్యటనకు అండర్-19 జట్టు ప్రకటన.. జట్టులోకి చిచ్చరపిడుగులు ఎంట్రీ..!
ఇందులో భాగంగా హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు రూ.12,000, కోకోకు కేజీకి రూ.500 ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వెల్లడించారు. కంపెనీల ద్వారా ఈ పంటల కొనుగోళ్లు జరిగేలా చూడాలని చెప్పారు. మద్దతు ధర కన్నా తక్కువగా మార్కెట్‌లో ధర రావాల్సి వస్తే, రైతులను నేరుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. హెచ్డీ బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది హెచ్డీ బర్లే రకానికి “క్రాప్ హాలిడే” ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు నష్టపోకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.
Read Also: YS Jagan: విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..!
అలాగే ప్యూర్ జ్యూస్‌లపై జీఎస్టీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిడ్ డే మీల్స్‌లో, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
