NTV Telugu Site icon

CM Chandrababu: రోడ్లు-భవనాల శాఖపై సీఎం సమీక్ష.. మరమ్మత్తుల కోసం నిధులు విడుదల

Chandrababu Review

Chandrababu Review

రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై రివ్యూ చేపట్టారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి బిసి జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అదే విధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధుల విడుదలకు కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని సీఎం కోరారు. ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలం అనేది మదింపు చేసుకుని టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Satyakumar Yadav: రాష్ట్ర ఆయుష్ విభాగానికి భారీ స్థాయిలో కేంద్ర నిధులు.. ఫ‌లించిన మంత్రి కృషి

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్ నెట్ వర్క్ కు తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారు అయ్యిందని తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కి.మీ రోడ్లలో మరమ్మతు పనులు చేసేందుకు రూ.186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పూడ్చడం కోసం రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్, లైడార్ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనుల చేయాలని ఆదేశించారు. సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న ROBల భూ సేకరణ కోసం పెండింగ్ లో ఉన్న రూ.42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సేతుబంధన్, గతి శక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ROBలను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పని చేయడం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనుకాడవద్దని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణ, హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సీఎం తెలిపారు.

Tollywood Hero: తెలుగు హీరోకి టోకరా.. రూ. 45 లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు

Show comments