దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్) విధానంపై దృష్టి పెట్టాలని తెలిపారు. గతంలో పీ3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ఉండేది.. ఇప్పుడు పీపుల్ పార్టనర్‌షిప్ కుడా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చాలామంది గ్లోబల్ సిటిజన్లుగా వెళ్లి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు.. సమాజంలో అట్టడుగున ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి కోరారు.
Read Also: Daaku Maharaaj: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నాగవంశీ కీలక ప్రకటన
అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికి కొన్ని లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.. సంక్రాంతికి ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో పేదరికాన్ని పోగొట్టాలని తెలిపారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద రాష్ట్రం కోసం సంకల్పం తీసుకుందామని కోరుతూ పీ4 విధాన పత్రాన్ని విడుదల చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Read Also: AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!