CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరంకు పనులకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారులు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నీటి సమస్య లేకుండా చేయొచ్చని ఆయన అన్నారు. పోలవరం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు.. 2014-19 మధ్య రేయింబవళ్ళు పని చేశామని ఆయన అన్నారు. చేసిన పనులు PPA సైతం అంగీకారం తెలిపింది.. టీడీపీ హయాంలో 72శాతం పనులు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.
Jagadish Reddy: ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుంది..
2019లో ప్రభుత్వం మారిన వెంటనే కాంట్రాక్టర్లను మార్చారని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు ను నాశనం చేసారన్నారు. పాత కొత్త కాంట్రాక్టర్లు కొనసాగితే ఇబ్బంది అవుతుందని PPA స్పష్టంగా చెప్పిందని, అనుకున్నట్టే డ ఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు అన్నారు. కుట్ర, కుతంత్రాలు, రాజకీయాలతో ప్రాజెక్టు సర్వ నాశనం చేసారని, 2020తర్వాత వచ్చిన వరదలతో గ్యాప్ 1 లో రెండు వందల మీటర్ల మేర అగాధాలు ఏర్పడ్డాయని, వైబ్రో కాంపాక్షన్ ద్వారా ఇసుకతో ఆగాదాలు పూడ్చి పనులు చేయాలన్నారు సీఎం చంద్రబాబు.
ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయడం వల్ల2,400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని, RMC, LMC కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉందని, పోలవరం 2026అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎప్పుడెప్పుడు ఏ పని చేయాలనే విషయంలో అధికారులు పూర్తి క్లారిటీతో ఉండాలి..ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021నాటికి ప్రాజెక్టు పూర్తి అయ్యేదని, పట్టిసీమ లేకుండా ఉంటే కృష్ణ డెల్టా ఎడారిగా మారేదన్నారు. ఒక వ్యక్తి అలసత్వానికి పోలవరం ఒక నిదర్శనమని, నాశనం అయినా ప్రాజెక్టు ను గాడిలో పెట్టడమే కాకుండా పూర్తి చేయడం లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. తెలిసి చేసినా , తెలియక చేసినా తప్పు తప్పే అని చంద్రబాబు అన్నారు.
Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు