AP CM Chandrababu: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Also: CM Chandrababu: టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలి..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థని అక్కడికక్కడ మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లె నుంచి సమీపంలోని శ్రీవాణి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరగా.. ఓబులవారిపల్లె దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో రెండో తరగతి విద్యార్థిని భవిష్య(8) మృతి చెందింది. ఈ ఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఈ బస్సును ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.