NTV Telugu Site icon

Chandrababu on Madanapalle Sub Collector Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనపై సీఎం కీలక వ్యాఖ్యలు..

Babu

Babu

Chandrababu on Madanapalle Sub Collector Incident: సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై అసెంబ్లీలో స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అగ్నిప్రమాద ఘటనపై ఇప్పటికే వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ.. మరోసారి అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావించారు.. 22-ఏ సెక్షనులో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల కాదని అధికారులు చెప్పారు. కావాలనే ఫైళ్లను తగులబెట్టారని అధికారులు చెప్పారని సభలో ప్రకటించారు.

Read Also: Harish Rao: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..

ఇక, గతంలో యనమలకుదురు కట్ట మీద కూడా పీసీబీ ఫైళ్లను తగులబెట్టారు. ఏదో చూసీ చూడనట్టు పోతుంటే ఆధారాలు తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని పిలుపునిచ్చారు. మాచర్లకు ఐదేళ్ల పాటు మేం వెళ్లలేకపోయాం. కానీ, జగన్ వినుకొండకు వెళ్లాలని భావిస్తే మేమేం అడ్డుకోలేదని గుర్తుచేశారు.. గవర్నర్‌ను అడ్డుకోవాలని వైసీపీ భావించిందని దుయ్యబట్టారు.. ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. తప్పుడు ఆరోణలు చేస్తున్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, 36 మంది పేర్లు మాత్రం చెప్పడం లేదు. ఫేక్ రాజకీయాలను సహించమని హెచ్చరించారు చంద్రబాబు.. మరోవైపు.. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే రావణ కాష్టమే అవుతుంది.. తప్పు చేసిన వ్యక్తులను వదిలేదే లేదు.. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. ముఠాలను కంట్రోల్ చేశాం.. రాజకీయ నేతలే రౌడీలైతే రాజకీయాలు నేరమయం అవుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.