Site icon NTV Telugu

CM Chandrababu Naidu: ఆ ఆటలు నా దగ్గర సాగవు.. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించను..!

Cm Nara

Cm Nara

CM Chandrababu Naidu: నేటితో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రంలో సీఎం చంద్రబాబు నాయుడు “విధ్వంసం నుండి వికాసానికి” అనే నినాదంతో ప్రభుత్వం అందించిన కీలక కార్యక్రమాలపై విశ్లేషణ చేసారు. ఇందులో మొదటగా “తల్లికి వందనం” పథకాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదని, ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు అంశాలపై వ్యాఖ్యానించారు.

Read Also: Thalliki Vandanam Scheme: 67 లక్షలకు పైగా పిల్లలకు ‘తల్లికి వందనం’.. రూ.2000 కట్.. ఎందుకంటే..?

ఇందులో భాగంగానే.. బటన్ నొక్కుతున్న అంటూ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్తితిని చిన్నా భిన్నం చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఉద్యోగులకు సరైనా జీతాలు కూడా గత ప్రభుత్వం ఉవ్వలేకబోయిందని విమర్శించారు. ఇక అన్నా క్యాంటీన్ల ద్వారా 4కోట్ల మంది ఆకలి తీరుస్తోంది.. నిరుద్యోగ భృతి కూడా వీలైనంత త్వరగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాము.. రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన పాలన అందించాలన్నది కూటమి సర్కార్ లక్ష్యం అంటూ పేర్కొన్నారు.

Read Also: YSRCP: “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” పుస్తకం విడుదల..!

నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడని చిత్రాలు వైస్సార్సీపీ వలన చూడాల్సి వస్తోందని అన్నారు. మెగా DSC ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి, అలాగే దీపం పథకం ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీ, పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా అందిస్తున్నామని స్పష్టం చేసారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న చర్యలపై ఆయన సీరియస్ అయ్యారు. తెనాలి రౌడీ షీటర్ దగ్గరకు వెళ్తారా.. ఎన్ని గుండెలు ఉండాలి. పొగాకుకు 12 వేల రూపాయలు ఎవరు ఇచ్చారు..? ఎప్పుడైనా పొగాకు రైతులకు మేలు చేసారా..? అమరావతి రాజధాని పై వేశ్య నగరంగా మాట్లడతారా..? ఎంత కొవ్వెక్కి ఉన్నారు.. ఇంట్లో అడబిడ్డలు లేరా..? తల్లి లేరా..? భార్య లేరా..? ఇష్యూ డైవర్ట్ కోసం పొదిలి వెళ్లారని ఆయన ఆగ్రహించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు నా మంచితనం చూసారు.. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించను అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Exit mobile version