Site icon NTV Telugu

CM Chandrababu: హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకించనున్నారు.

Raja Saab: వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. “సహానా.. సహానా” అంటూ రెచ్చిపోయాడుగా..!

ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సీఎం సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఈ ఆశ్రమం కలిగి ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షులు దాజీ నేతృత్వంలో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది.

IND vs PAK U-19: సీనియర్లే కాదు జూనియర్స్ కూడా.. భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..!

‘కౌశలం’ పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. కన్హా శాంతివనంలోని యోగా, మెడిటేషన్, వెల్ నెస్ సెంటర్లతో పాటు సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్ లో బయల్దేరి అమరావతికి తిరిగి వెళ్లనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షల్లో పాల్గొనున్నారు. రేపు సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.

Exit mobile version