ONGC Gas: రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్
గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో ఇప్పటికే స్థానిక అధికారులతో చర్చించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించినట్లు మంత్రులు సీఎంకు వివరించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రమాద ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే, గ్యాస్ లీకేజీ వల్ల ఏర్పడిన మంటలను వెంటనే అదుపులోకి తీసుకువచ్చేలా అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లా అధికారులు, ఓఎన్‌జీసీ ప్రతినిధులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
ONGC Gas Leak: లీకైన ONGC గ్యాస్ పైప్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు, భయాందోళనలో ప్రజలు..!
పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పాటు.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరుసుమండ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
భద్రతా చర్యల్లో భాగంగా గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, సుమారు 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్యాస్ లీకేజీ ప్రభావంతో గ్రామ పరిసరాల్లోని కొబ్బరి చెట్లు మాడి మసి కావడంతో పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఘటన స్థలాన్ని అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రమాదం జరగకుండా అర కిలోమీటర్ దూరం వరకు ప్రజలను రాకుండా కట్టడి చేశారు. గ్యాస్ లీకేజీ కారణంగా భారీ మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. అధికార సమీక్ష సమావేశం నిర్వహించి, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
