CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మరో మూడు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోన్న ఆయన.. ఉదయం 11 గంటలకు సెక్రటేరీయేట్‌కు వస్తారు.. ఇక, వివిధ శాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.. వైద్య-ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, యువజన మరియు క్రీడల శాఖలపై ఈ రోజు సీఎం రివ్యూ చేస్తారు. నూతనంగా తీసుకువస్తున్న ఇండస్ట్రియల్ పాలసీపై అధికారులతో చర్చిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు..
Read Also:Google pay : గూగుల్ పేలో పేమెంట్ హిస్టరీ డిలీట్ ఎలా చేయాలంటే ?
మరోవైపు.. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓ నిర్ణయానికి రానున్నారు.. అప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది.. అంతేకాదు.. తమ ప్రజాప్రతినిధులను క్యాంప్‌కు తరలించింది.. ఈరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు బొత్స.. అయితే, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే విశాఖపట్నం నేతలతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఆ స్థానంలో కూటమి బలం ఎంత? అభ్యర్థి ఎవరైతే బెటర్ అనే విషయాలపై ఆరా తీశారు.. కానీ, ఇప్పటి వరకు పోటీపై గానీ, అభ్యర్థిపై గానీ.. ప్రకటన రాలేదు.. ఈ నేపథ్యంలో.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఇవాళ క్లారిటీ ఇవ్వనున్నారట చంద్రబాబు.