CM Chandrababu: ఆర్ అండ్ బీ శాఖపై సీఎం సమీక్ష.. రోడ్ల దుస్థితి చర్చ.. కీలక ఆదేశాలు
- ఆర్ అండ్ బీ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..
- రోడ్ల నిర్మాణం.. రోడ్ల దుస్థితిపై చర్చ.. రోడ్ల పరిస్థితిపై ఆరా..
- దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు.. మరోవైపు.. వివిధ శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష చేశారు.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం.. రోడ్ల దుస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు.. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని సీఎం చంద్రబాబుకు చెప్పారు అధికారులు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు.. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని సీఎంకు వివరించారు అధికారులు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం అని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్ అండ్ బీ అధికారులు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
అయితే, అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు అని మండిపడ్డ ఆయన.. వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని స్పష్టం చేశారు.. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలి.. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉంది. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!