CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో రాష్ట్ర ప్రజలకు ఓ మాట సైతం ఇచ్చారు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను చేరుకుందని తెలిపారు.
READ MORE: RRB Recruitment 2026: రైల్వేలో ఐసోలేటెడ్ కేటగిరీలో 312 జాబ్స్.. ఈ అర్హతలుంటే చాలు..
“అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా… 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు…. నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం – సంక్షేమం – అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026”.. అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
READ MORE: Sadanand Date: మహారాష్ట్ర డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే..
