CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో రాష్ట్ర ప్రజలకు ఓ మాట సైతం ఇచ్చారు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను చేరుకుందని తెలిపారు.