Site icon NTV Telugu

CM Chandrababu: ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై సీఎం సమీక్ష.. కీలక సూచనలు

Cbn

Cbn

CM Chandrababu: ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె. విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఎరువుల లభ్యత, సరఫరా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు.. అయితే, ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఈ సారి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని సీఎంకు తెలిపారు అధికారులు.. అయితే, ఈ క్రాప్ ద్వారా ఎంత సాగు అవుతుంది.. ఎంత వినియోగం జరుగుతోంది అనేది లెక్కించాలని పేర్కొన్నారు సీఎం.. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని స్పష్టం చేశారు..

Read Also: Vikram 32-bit Processor: సెమికాన్ ఇండియాలో.. తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని మోడీ..

మరోవైపు.. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు.. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని.. వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా.. నష్టపరిహారం చెల్లించి అయినా.. తెగులు వచ్చిన పంటను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version