Site icon NTV Telugu

Kakarla Suresh: అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీఠ వేశారు!

Kakarla Suresh

Kakarla Suresh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు. దేశంలోని కోటి సభ్యత్వం కలిగిన ప్రధాన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే కాకర్ల కొనియాడారు. వింజమూరు ఎస్వి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కాకర్ల టీడీపీ మహానాడు నిర్వహించారు. మహానాడులో టీడీపీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారకరామారావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో 11 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 11 నెలల్లోని పార్టీని నందమూరి తారక రామారావు అధికారంలోకి తీసుకొచ్చారు. దేశంలోని కోటి సభ్యత్వం కలిగిన ప్రధాన పార్టీ తెలుగుదేశం. రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తాం’ అని అన్నారు.

Exit mobile version