Site icon NTV Telugu

CM Chandrababu: యోగాంధ్ర సూపర్ హిట్.. హిస్టరీ క్రియేట్ చేయగలిగాం..

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. విశాఖ కలెక్టరేట్ లో యోగాడే గ్రాండ్ సక్సస్ పై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులుతో సమీక్షించారు. విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సిఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్నివిభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు.

Also Read:Meta Oakley smart glasses: మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్ విడుదల.. ఫోన్ కాల్స్, మ్యూజిక్ వినొచ్చు!

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యత తీసుకుని పనిచేసిన తీరుకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఆర్థరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలి రావడం ఆశ్య్చర్యాన్ని కలిగించిందన్నారు కొందరు అధికారులు. విశాఖ యోగా డేలో 3 లక్షల మందికి పైగా యోగా సాధనలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. పాల్గొన్నవారి లెక్కింపులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందన్నారు మంత్రులు. యోగాంధ్ర సూపర్ హిట్ అయ్యింది.. హిస్టరీ క్రియేట్ చేయగలిగామని సీఎం తెలిపారు.

Also Read:Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ

తెల్లవారుజామున 3లక్షల 03 వేల మందికి పైగా క్యూ ఆర్ కోడ్ తో వెన్యూ కి వచ్చారు.. రెండు గిన్నీస్ రికార్డులు నమోదు చేశాం.. కోటి 80లక్షల మందికి యోగా సర్టిఫికెట్ల కోసం రిజిస్ట్రేషన్ అయ్యింది.. 10ఏళ్ల ప్రధాని కృషి ఫలించింది.. 12 లక్షల లోకేష్ నలో 10కోట్ల మంది భాగస్వామ్యులయ్యారు.. యోగాడే ను విశాఖ లో నిర్వ హించమని ప్రధాని అడిగారు.. నెల రోజుల షెడ్యూల్ కాలంలో అధికార యంత్రాంగం విశేషంగా పనిచేశారు.. జీరో ఇన్సిడెంట్స్ తో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం గొప్ప విషయమని సీఎం వెల్లడించారు.

Exit mobile version