NTV Telugu Site icon

CM Chandrababu: మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం!

Cm Chandrababu

Cm Chandrababu

మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భేటీ జరగనుంది. రెండు సెషన్‌లుగా ఈ సమావేశం జరగనుంది. మొదటి సెషన్‌లో ఫైళ్లు క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీపై చర్చ జరగనుంది.

రెండో సెషన్‌లో కేంద్ర బడ్జెట్ సహా త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్‌పై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిచనున్నారు. శాఖల వారీగా ప్రగతి, మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047పై కూడా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం లోగా సెక్రెటరీలు తమ శాఖలకు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకు అనుగుణంగా సెక్రెటరీలు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సీఎస్ ఆదేశించింది.