Site icon NTV Telugu

CM Chandrababu: టెక్నాలజీ వినియోగంతో ప్రజల భద్రతపై దృష్టి.. అవేర్ 2.0 లాంచ్!

Cm Chandrababu Singapore

Cm Chandrababu Singapore

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఆర్టీజిఎస్‌ను సందర్శించి ‘అవేర్ 2.0’ను ప్రారంభించారు. అవేర్ డాష్‌బోర్డ్ ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిశీలించారు. అలాగే రియల్ టైమ్ స్క్రీన్‌పై వాహనాల ట్రాఫిక్ రద్దీని పరిశీలించి, తక్షణ చర్యలకు సూచనలు ఇచ్చారు. అనంతరం సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఆర్టీజిఎస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Pulivendula Elections: ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు!

సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, జీరో మలేరియా లక్ష్యంతో ముందుకు సాగాలని ఆదేశించారు. డ్రోన్ల సాయంతో హాట్ స్పాట్‌లను గుర్తించి, వెంటనే కంటామినేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణతో రౌడీ షీటర్లలో భయాందోళన కలిగించాలని ఆయన సూచించారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి అసాంఘిక కార్యకలాపాలను అణచివేయాలని ఆయన స్పష్టం చేశారు.

Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..!

అలాగే, ఎఐ సాంకేతికత ద్వారా గాలి నాణ్యత (విండ్ క్వాలిటీ)ను మానిటర్ చేయాలని సూచించారు. ఈ మీటింగ్ లో అవేర్ డేటా అక్విజిషన్ ట్రాకర్ విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షపాతం పడే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి, స్థానిక సాగునీటి సంఘాలు, సంబంధిత ఇంజనీర్లను ముందస్తు చర్యలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమగ్ర సమీక్షలో ప్రజా భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, నేర నియంత్రణ వంటి అంశాలపై టెక్నాలజీ ఆధారిత పథకాలను సీఎం ముఖ్యంగా ప్రస్తావించారు.

Exit mobile version