NTV Telugu Site icon

CM Chandrababu : రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి గెలుపొందారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

అయితే.. 25న మధ్యాహ్నం 12.30 హెలీకాప్టర్లో పీఈ ఎస్ వైద్య కళాశాలకు చేరుకుంటారు. 12:55: హంద్రీ-నీవా, హెచ్ఎన్ఎన్ కాలువల పరిశీలన, 2:10 కుప్పం ఆర్అండ్ బీ అతిథిగృహానికి రాక, 3:00: ఆర్టీసీ బస్టాండు సమీపంలో బహిరంగ సభ. సాయంత్రం 4.40 గంటలకు ఆర్అండ్‌బీ భవనంలో పార్టీ నేతలతో సమా వేశం, రాత్రి బస. 26న ఉదయం 10:30- 11:50 వినతుల స్వీకరణ. 12:00గంటలకు డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష. 2:40 నుంచి 4 గంటల వరకు పీఈఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించున్నారు.