NTV Telugu Site icon

AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు

Chandrababu On Puttaparti S

Chandrababu On Puttaparti S

AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో కలెక్టర్ కాన్పరెన్సులో సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. సత్యసాయిబాబా దగ్గర డబ్బుల్లేవు.. అయితే అనంతపురంకు తాగునీరు అందించాలనే తపన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే తాను ఓ కాల్ ఇస్తానన్నారు.. ఇచ్చారు దీంతో రూ. 200 కోట్లు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు. ఆ వాటర్ ప్రాజెక్టులను తన భక్తులైన ఎల్ అండ్ టీని పెట్టి మెయింటెయిన్ చేయమని ఆయన కోరారని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో అక్కడ తాగునీరు ఇచ్చేందుకు చేయాల్సిన మెయింటెనెన్సుకు డబ్బులివ్వకుండా మూసేశారని.. సత్యసాయి ఓ మంచి ఉద్దేశంతో అప్పగించిన ప్రాజెక్టును ఆయన చనిపోతే మెయింటెనెన్స్ చేయకుండా, జీతాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తామని సీఎం ప్రకటించారు.

Read Also: Andhra Pradesh: వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన

దోమల నివారణకు మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్, పంచాయితీరాజ్, హెల్త్ కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. వాటిని కంట్రోల్ చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వేస్ట్ టూ ఎనర్జీ పవర్ ప్రాంట్ పెట్టి ప్రైవేట్ వారిని గుంటూరు, విశాఖలలో అట్రాక్ట్ చేశామన్నారు. రూరల్ ఏరియాలో లిక్విడ్ వేస్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూడాలన్నారు. వేస్టును కలెక్ట్ చేసి ఇచ్చే బాధ్యత కలెక్టర్లది.. అలా ఇస్తే వారు గార్బేజీని పవర్ కింద మార్చుకుంటామన్నారు. ఏ మున్సిపాలిటీల్లో చెత్త కనపడకూడదని.. రోడ్లు అన్ని పీపీపీ మోడల్లో మెయింటెనెన్స్ ఇచ్చేయాలన్నారు. ఎక్కడయినా గుంతలు ఉంటే వారే మెయిన్ టెయిన్ చేస్తారని చెప్పారు. అర్బన్ ఏరియాలలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటే ఇస్తామని సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పైప్ లైన్సును అడ్డదిడ్డంగా వేశారన ఆగ్రహం వ్యక్తం చేశారు.జలజీవన్ మిషన్లో నిధులు కేంద్రం ఇస్తోందని చెప్పారు. దీనిలో మన రాష్ట్రం చివరి వరుసలో ఉన్నాం.. వెంటనే దీనిపై దృష్టిసారించాలన్నారు. దీనిపై టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పనిచేయాలన్నారు. అన్న క్యాంటిన్లను సెల్ప్ సఫిషియంట్ చేయాలని.. దీనికి టీటీడీ మాదిరి డొనేషన్లు వస్తున్నాయన్నారు. వీటి కోసం కలెక్టర్లు మరింత ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Read Also: Chandrababu: రాజధాని పరిధిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

గృహ నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు గత ప్రభుత్వం రూ. 3183 కోట్లు డైవర్ట్ చేసిందని.. గతంలో రాష్ట్రం ఇవ్వాల్సిన రూ. 1603 కోట్లు ఇవ్వలేదు.. దీనిపై కేంద్రం రూ. 28 కోట్లు ఫైన్ వేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గృహ నిర్మాణ నిధులను మరో రూ. 500 కోట్లు డైవర్ట్ చేశారన్నారు. కేంద్రం నుంచి గడిచిన ఐదేళ్లల్లో రూ. 8 వేలకోట్లు రాకుండా చేశారన్నారు. కార్పొరేషన్లు 5 వేలు కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సింది రూ. 3,500 కోట్లు రాకుండా చేశారన్నారు. మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడం, డబ్బులు డైవర్ట్ చేయడం, క్లైమ్ చేయకపోవడం వల్ల నష్టపోయామని సీఎం చెప్పారు.