CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. పలు ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం పై ప్రధానికి వివరించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతకు ముందు ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.
Read Also: PM Modi: జనవరి 8న ఏపీకి ప్రధాని.. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. నవంబరులో జరగాల్సిన ప్రధాని పర్యటన తుఫాన్ కారణంగా వాయిదా పడడంతో శంకుస్థాపనలు నిలిచిపోయాయి.