NTV Telugu Site icon

CM Chandrababu: ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలి..

Chandrababu

Chandrababu

CM Chandrababu: నాలెడ్జ్ సొసైటీ మన లక్ష్యమని.. ఉన్నత విద్య అంశాలు ఏమిటనేది సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలన్నారు. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు కూడా అందరూ ముందుకు రావాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఒక ప్రత్యేక వింగ్ పెట్టుకోవాలన్నారు. మంగళగిరిలో స్కిల్ సెన్సస్ చేశామని.. మంగళగిరి, తాడేపల్లిలకు చాలామంది వలస వస్తారన్నారు. స్కిల్ సెన్సస్ అనేది ప్రస్తుతానికి ఆప్షనల్.. స్కిల్ సెన్సస్ ఆరునెలల్లో అవ్వాల్సినది ఇంకా అవ్వాలన్నారు. స్కిల్ సెన్సస్ ఎప్పటి లోగా పూర్తి చేస్తారనేది తెలియాలన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ డిగ్రీలను గుర్తించాలని.. ఎడ్యుకేషన్ విషయంలో చాలా స్లోగా ఉన్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్‌లో లేదా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఏదో లోపం ఉందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో రిజల్ట్ చాలా డల్‌గా ఉందన్నారు. స్కిల్ కోసం కేంద్ర పథకంలో రిజిష్టర్ చేసే వారిని మానిటర్ చేయాలన్నారు. డీఎస్సీ మీటింగ్‌లు తగిన విధంగా జరగలేదని.. కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. సచివాలయాల ద్వారా టెక్నికల్ స్కిల్స్ పెంచాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌పైన సీఎం సీరియస్ అయ్యారు.

Read Also: Grandhi Srinivas: ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతా..

అమరావతి రాజధాని నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అమరావతి అనేది ప్రజా రాజధాని అని.. అలాగే యువతకు ఉపాధి కల్పించే రాజధాని అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే విశాఖ, తిరుపతి, అమరావతి నగరాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఒక కుటుంబం- ఒక ఎంట్రప్రెన్యూర్ అనేది అమలు కావాలన్నారు. పలు నాలెడ్జీ ఎకానమీ యూనివర్శిటీలు ఇక్కడకు వస్తున్నాయి. ప్రపంచంలోని టాప్ 10 విశ్వ విద్యాలయాలు, టాప్ 10 ఆసుపత్రులు ఇక్కడకు రానున్నాయన్నారు.

పరిశ్రమలు, ఐటీ పార్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ప్రసంగించారు. ఉద్యోగాల కల్పన చాలా ప్రధానమైన అంశమని.. వచ్చే సమావేశానికి ఒక్కో జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే వివరాలతో రావాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రైతులను భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. అంతిమ లబ్దిదారులుగా వారుండేలా ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమలకు అనుమతులిచ్చే విషయంలో అలసత్వం తగదన్నారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడ్డారని.. ఇప్పుడు ఆ పరిస్థితి పోగొట్టి మళ్లీ అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Show comments